English | Telugu

అవకాశాల్లేక పానీపూరి బండి పెట్టుకున్న శ్రీవాణి


ఘర్షణ, చంద్రముఖి సీరియల్స్ తో బుల్లి తెరపై సూపర్ పాపులర్ ఐన శ్రీవాణి ప్రస్తుతం అనుకున్నంత మేరకు అవకాశాలు రాకపోవడంతో చేసేదేం లేక శ్రీవాణి , భర్త విక్రమ్ పానీపూరి బండి పెట్టుకుని రోజులు వెళ్లదీస్తున్నారు. ఇక శ్రీవాణిని కలవడానికి తమిళ్ ఇండస్ట్రీలో యాక్ట్ చేసే తన ఫ్రెండ్ నిప్పా వస్తుంది. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అవకాశాలు రాక ఇలా పానీపూరి బండి నడిపించుకుంటున్నాం అని చెప్తుంది. ఇక్కడే మా ఆయన బండి ఉంది పద వెళదాం పానీపూరి తిందువు గాని అంటూ తీసుకెళ్తుంది. అక్కడ శ్రీవాణి భర్త నిజంగానే పానీపూరి అమ్ముతూ కనిపిస్తాడు. ఈ బండి మీద నేను లక్షన్నర సంపాదిస్తున్నాను. ఇలాంటి బళ్ళు మాకు పది ఉన్నాయి మీరు కూడా మీ ఏరియాలో ఇలాంటి ఒక బండి పెట్టుకోండి మంచి లాభం వస్తుంది అంటూ సలహా ఇస్తాడు విక్రమ్ నిప్పాకి.

నిప్పా తనకు హైదరాబాద్ లో షూటింగ్ కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి పానీపూరి పార్సిల్స్ కావాలంటే పంపిస్తారా అంటూ అడుగుతుంది. అందులో ఏముంది మా ఆయన పంపిస్తారు. డోర్ డెలివరీ కూడా ఉంది అంటుంది శ్రీవాణి. అంతలో అక్కడికి శ్రీవాణి ఫ్రెండ్ నీలిమ కూడా వస్తుంది. అలా బండి మీద పానీపూరి అమ్మడాన్ని చూసి నిజంగా షాక్ అవుతుంది. వచ్చే పోయే వాళ్లందరినీ బండి దగ్గరకు రమ్మని పిలుస్తూ రియాలిటీ దగ్గరగా ఉండేలా చేసిన ఈ ప్రాంక్ వీడియో ఇప్పుడు చాలా మందిని సోషల్ మీడియాలో ఆకర్షిస్తోంది. ఇంత ఎండలో నిలబడి పానీపూరి బండి వాళ్ళు ఎలా పని చేస్తున్నారో అందరికీ చెప్పడం కోసమే ఈ వెరైటీ ప్రాంక్ చేసి మా యూట్యూబ్ లో పెట్టాం అంటూ నిప్పాకి, నీలిమకు చెప్పేసరికి ప్రాంకా అంటూ నోరెళ్లబెడతారు వాళ్ళు. ఎలాంటి అవకాశాలు లేనప్పుడు ఇలా బండి పెట్టుకుని సేల్ చేసుకోవడం ఏమి తప్పు కాదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు. ఈ ప్రాంక్, వ్లోగ్ సూపర్ అంటూ మెస్సేజెస్ ని షేర్ చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.